మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో మూడు రోజులు సాగుతున్న వార్షిక తనిఖీలు శనివారం ముగిశాయి. తెలంగాణ ప్రత్యేక పోలీస్ విభాగం డీఐజీ మురళీకృష్ణ తనిఖీల అనంతరం బెటాలియన్ పరిపాలన విభాగం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలోని వాహనాల నిర్వహణ, భద్రత, ఇంధన పొదుపుపై సూచనలు చేశారు. రికార్డులు, సిబ్బంది హాజరు పరిశీలించారు. పరేడ్ మైదానాన్ని పరిశీలించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కమాండెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండెంట్లు ఆంజనేయరెడ్డి, నాగభూషణం, వీరరాజు, యూనిట్ మెడికల్ అధికారి డాక్టర్ సంతోశ్సింగ్, పరిపాలనా విభాగం అధికారి గౌస్ మోహీయోద్దీన్, బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.


