అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

● డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ● పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

● డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ● పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

మంచిర్యాలక్రైం: ప్రజల రక్షణలో భాగంగా ఎందరో పోలీస్‌ అధికారులు అమరులయ్యారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం మంచిర్యాలలోని ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. పోలీసులు 27 మంది రక్తదానం చేశారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణతోపాటు ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్‌, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు మధుసూదన్‌, రామకృష్ణ, రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహేందర్‌, లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మంచిర్యాల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement