రెబ్బెన: గోలేటిలోని దుబ్బగూడలో రాజనర్సు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో శనివారం 12 ఫీట్ల పొడవైన భారీ కొండచిలువ ప్రత్యక్షమై భయాందోళనకు గురిచేసింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన కొండచిలువ ఇంటి ఆవరణలోని కోళ్ల ఫాంలో దూరి 8 కోళ్లను మింగేసింది. శనివారం ఉదయం పూట రాజనర్సు కోళ్ల ఫాం వద్దకు వెళ్లగా ఒక్కసారిగా భారీ కొండచిలువ కనిపించడంతో వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ దుర్గం రాజేశ్ ఫారెస్టు అధికారుల సమక్ష్యంలో కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులు కొండచిలువను చోపిడి అటవీప్రాంతంలో సురక్షితంగా వదిలేశారు. సెక్షన్ అధికారి రవి, ఫారెస్టు భీట్ అధికారులు మహేశ్, అనిల్ ఉన్నారు.


