మంచిర్యాలటౌన్: పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధికి చర్యలు తీసుకోవా లని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌వెంకటస్వామితో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. రూ.వెయ్యి కోట్లతో మంజూరైన 16 రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, మంచిర్యాల జిల్లాలో రైల్వే అండర్‌బ్రిడ్జిలు, సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. మంచిర్యాల హైటెక్‌సిటీ నుంచి రాజీవ్‌నగర్ వరకు, మందమర్రి పరిధిలో నార్లాపూర్ నుంచి అందుగుల పేట వరకు ఆర్‌వోబీలు, సబ్‌వేల నిర్మాణం చేపట్టలని పేర్కొన్నారు. హమాలీవాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు మందమర్రి, రేచిని రోడ్ రైల్వేస్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల విస్తరణకు నిధులు, అనుమతి మంజూరు చేయాలని కోరారు. మంచిర్యాల, పెద్దపల్లి ప్రజలకు అదనపు రైళ్ల స్టాపేజీలు, మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో భగత్ కీ కోఠి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్, తిరుపతి వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని కోరారు. సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులను మెరుగుపరిచి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు.


