కోటపల్లిలో మెగా రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

కోటపల్లిలో మెగా రక్తదాన శిబిరం

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

కోటపల్లి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చెన్నూరు రూరల్‌ సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మెగా రక్తదాన, ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. 134 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. సుమారు 100 మందికి కంటి పరీక్షలు చేశారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టిన పోలీస్‌ల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అనంతరం మహిళలకు చీరలు, గ్రామీణ యువతను వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు. డ్రైవర్లు ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్‌ సీఐ ఆర్‌.కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్‌, నీల్వాయి ఎస్సై నాగరాజు, రెడ్‌క్రాస్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ మహేందర్‌, తలసేమియా వెల్ఫేర్‌ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్‌కుమార్‌, ఉత్తమ్‌, మండల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement