కాకో ఆలయంలో దండారీ సంబురాలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

కాకో ఆలయంలో దండారీ సంబురాలు షురూ..

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

దండేపల్లి: రాష్ట్రంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధి గాంచిన మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డునగల ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీపద్మల్‌పురి కాకో ఆలయంలో దండారీ సంబురాలు మొదలయ్యాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ గిరిజనులు కాకోను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఆదివాసీ గిరిజనులు గుస్సాడీ వేషాలతో నృత్యాలు చేయడం ఆకట్టుకుంది.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

నిర్మల్‌టౌన్‌: అండర్‌–17 ఎస్‌జీఎఫ్‌ బాలుర క్రికెట్‌లో నిర్మల్‌కు చెందిన జాదవ్‌ ఉమేశ్‌ జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల గద్వాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పో టీల్లో ప్రతిభ కనబరిచి తెలంగాణ జట్టులో చోటు సంపాదించాడు. వచ్చే నెలలో మధ్యప్రదేశ్‌లోని గువాహటిలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననున్నాడు. నిర్మల్‌ శివారు కొండాపూర్‌లోని లక్కీ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌ సుదర్శన్‌ వద్ద బ్యాటింగ్‌లో శిక్షణ పొందిన ఉమేశ్‌ జాతీయస్థాయికి ఎంపిక కాగా అకాడమీ నిర్వాహకులు, కోచ్‌ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement