మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీ పరి ధిలో మూడు జిల్లాల అంతర కళాశాలల సాఫ్ట్‌బాల్ పోటీల్లో మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో హన్మకొండలో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కేడీసీ డిగ్రీ కాలేజీపై 4–3 తేడాతో మిమ్స్ కళాశాల జట్టు విజయం సాధించి స్వ ర్ణపతకాన్ని కైవసం చే సుకుంది. వచ్చే నెలలో పంజాబ్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సాఫ్ట్‌బాల్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ తరఫున ఆడేందుకు ప్రదీప్, అఖిల్, సాయిప్రభాస్, శ్రీకర్, అభిరామ్ ఎంపికయ్యారు. వీరిని కరస్పాండెంట్ శ్రీనివాస్‌రాజు, ప్రిన్సిపాల్ ఉపేందర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డైరెక్టర్ వి జయ్‌కుమార్, పీడీ శ్రీనివాస్ అభినందించారు.


