డిసెంబర్లో పూత దశ
బెల్లంపల్లి: మామిడిని చీడపీడలు, తెగుళ్లు ఆశించకుండా, అ ధిక దిగుబడి సాధించేలా రైతులు యాజమాన్య పద్ధతులు పా టించాలి. నిర్లక్ష్యం చేస్తే తోట లు నిర్జీవంగా తయారు కావడంతోపాటు దిగుబడి పడిపో యి తీవ్రంగా నష్టపోవాల్సిన ప రిస్థితులు ఉంటాయని బెల్లంపల్లి క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారి అర్చన తెలిపారు. ఆమె మాటల్లో మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు ఇలా..
చీడపీడలు, నియంత్రణ చర్యలు
తేనె మంచు పురుగు: మామిడిని ప్రధానంగా తేనె మంచు పురుగు ఆశిస్తే 20నుంచి 100శాతం వరకు నష్టం కలుగుతుంది. ఈ పురుగు లేత ఆకులు, పుష్పగుచ్చాలు, పూలు, పిందెలను చేరి రసాన్ని పీలుస్తాయి. ఇది విసర్జించిన తేనెలాంటి తీయని పదార్థంతో మసిమంగు ఆశిస్తుంది. మంచు పురుగు ప్రభావంతో పూత, కాతలేని సమయంలో చెట్ల బెరడులోని పగుళ్లు, చెట్టు కాండంపై దాక్కొని ఉంటాయి. ఈ పురుగు రసం పీల్చడంతో పూత పూర్తిగా మాడిపోయి పిందె కట్టదు.
నియంత్రణ: తేనె మంచు పురుగు నియంత్రణకు త యోమెథొక్సం 0.5 గ్రాములు లీటర్ నీటికి లేదా లా ంబ్డా సహైలోత్రిన్ 0.5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి.
తామర పురుగు: తామర పురుగు మామిడికి నష్టం కలిగిస్తుంది. చెట్లకు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు చిన్నవిగా ఉండి రాలిపోతాయి. పుష్పగుచ్చం, పిందెలపై చర్మం గీకి రసం పీల్చడంతో రాతి మంగు ఏర్పడి కాయ నాణ్యత తగ్గుతుంది.
నియంత్రణ: తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 1.5 మిల్లీ లీటర్ లేదా ఆసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి.
ఆకు జల్లెడ గూడు పురుగు: ఈ పురుగు ఆకుల ఈనెల మధ్య ఉన్న కణజాలాన్ని పూర్తిగా తినేసి ఆకుల్ని జల్లెడ లాగా చేసి ఆ తర్వాత ఆకుల్ని దగ్గరకు చేర్చి గూడు ఏర్పరుచుకుంటుంది. పూత దశలో పూలు, మొగ్గలను ఆశించి పూగుత్తులను గూడుగా ఏర్పాటు చేసుకుంటుంది.
నియంత్రణ: ఆకు జల్లెడ పురుగు నియంత్రణకు పురుగుల గూళ్లను ముందుగా వెదురు కర్రలతో దులిపి క్లోరిఫైరిఫోస్ 2మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: బూడిద తెగులు కూడా మామిడిని కోలుకోకుండా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఆకులు, పూరెమ్మల మీద బూడిదలాంటి తెల్లని పదార్థం వ్యాపించి పూత, పిందె రాలి పోయి నష్టం కలిగిస్తుంది.
నియంత్రణ: బూడిద తెగులు నివారణకు కారేథేన్ ఒక మిల్లీ లీటర్ లేదా హెక్సాకోనోజెల్ ఒక మిల్లీ లీటర్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పక్షి కన్ను తెగులు: ఆ శిలీంద్రం ఆకులపై మచ్చ తెగులునే కాక చిగురు మాడు, పూత మాడు తెగుళ్లను కూడా కలిగిస్తుంది. గాలిలో అధిక తేమ, అకాల వర్షం అధికంగా కురిసినప్పుడు ఈ తెగులు కాయలను ఆశిస్తుంది.
నియంత్రణ: పక్షి కన్ను తెగులు నియంత్రణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో లేదా కార్బెండిజ్ ఒక గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పురుగు మందులను చల్లని వేళలో అనగా ఉదయం లేదా సాయంత్రం పూట పిచికారీ చేయాలి. పురుగు మందులను మార్చి వాడాలి. ఒకే మందును అనేకసార్లు వాడితే పురుగులు ఆ మందులకు అలవాటు పడిపోయి నశించవు.
అక్టోబర్, నవంబర్ మాసాల్లో మామిడి చెట్లు నిద్రావస్థ దశలో ఉంటాయి. ఈ రెండు నెలలు చెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటితడులు అందించవద్దు. మామిడి చెట్లకు పూ మొగ్గలు అన్ని ఒకేసారి విచ్చుకోవడం, కాయలు కూడా ఒకేసారి కట్టడం కోసం పొటాషియం నైట్రేట్‌ను 10 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అక్టోబర్‌లో పిచికారీ చేయలేని పరిస్థితుల్లో నవంబర్‌లో చేసుకోవాలి. డిసెంబర్లో పూత మొదలై జనవరిలో పాచిపూతదశ లేదా పూత వికసించే దశ మొదలవుతుంది.


