‘ఎవరెస్ట్‌’ అధిరోహణకు ఆర్థికసాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

‘ఎవరెస్ట్‌’ అధిరోహణకు ఆర్థికసాయం చేస్తాం

Oct 30 2026 12:09 AM | Updated on Oct 30 2026 12:09 AM

కెరమెరి: నేపాల్‌లో వచ్చేఏడాది మే నెలలో నిర్వహించే ఎవరెస్టు శిఖరం ఽఅధిరోహణకు ఆర్థికసాయం అందిస్తానని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. ఇటీవల మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపును అధిరోహించిన కెరమెరి మండలం భీమన్‌గోంది గ్రామానికి చెందిన మడావి కన్నిబాయికి బుధవారం రాత్రి ఉట్నూర్‌ పీఎంఆర్‌సీలో పీవో ఆమెను సన్మానించారు. నేపాల్‌ ప్రభుత్వం అందజేసే సర్టిఫికెట్‌, జ్ఞాపికను అందించారు. ప్రతి ఒక్కరూ కన్నిబాయిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్‌లైంబింగ్‌కు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని పీవో హామీ ఇచ్చారు. ఏపీవో వంసంత్‌రావు, డీడీలు, ఏటీడీవోలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement