భైంసాటౌన్: పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. గతనెలలో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన రితుశ్రీ, రీతిక, అనన్య, శ్రీనిధి, అద్విత, హ్రిదిత్య, అలోక్ ఈమేరకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈనెల 30 నుంచి నవంబర్ 4 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి విద్యార్థులను అభినందించినట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు.


