కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి తరహాలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులకు యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట కేంద్రాలు ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్, కుంటాల, ఆసిఫాబాద్, మందమర్రి ఆదర్శ పాఠశాలలను ఎంపిక చేశారు.
పోటీపరీక్షలకూ..
ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, జేఈఈ, మెయిన్స్, నీట్ వంటి పోటీ పరీక్షలకు ఎక్సలెన్స్ పాఠాలు బోధించనున్నారు. నవంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి 9, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శిక్షణ ఇస్తారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటని, ఫిజిక్స్‌లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థులు సీట్లు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ప్రతీ విద్యార్థికి సామగ్రి కోసం రూ.1200 కేటాయిస్తారు.
విద్యార్థులకు ప్రయోజనం
ఆదర్శ పాఠశాలల్లో జేఈఈ, మెయిన్స్, ఐఐటీ, నీట్‌పై కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు శిక్షణనివ్వడం ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వీటిని సద్వినియోగం చేసుకుని భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలి. – ఎత్రాజ్ రాజు, ప్రిన్సిపాల్, ఆదర్శ పాఠశాల, కుంటాల


