దండేపల్లి: దండేపల్లి శివారులో అడవిపందుల దాడిలో వరి పంట ధ్వంసమైంది. బొలిశెట్టి దత్తయ్య సుమారు మూడెకరాల వరి సాగు చేశాడు. గురువారం తెల్లవారుజామున సుమారు ఎకరంన్నరకు పైగా వరిని అడవిపందులు తొక్కి ధ్వంసం చేశాయి. కొన్నిరోజుల్లో పంట చేతికందే సమయంలో పంటను ధ్వంసం చేయడంతో బాధిత రైతు తీవ్రంగా నష్టపోయాడు. అటవీ అధికారులు తనకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నాడు.
ఏసీబీకి చిక్కిన జీపీవో
ఆసిఫాబాద్‌క్రైమ్: కుమురంభీం ఆసిఫాబా ద్ జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ గ్రామ పాలన అధికారి(జీపీవో ) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కా డు. ఆదిలాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శా ఖ డీఎస్పీ మధు వెల్లడించిన వివరాల ప్రకా రం.. కాగజ్‌నగర్ మండలం మోసం గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి తండ్రి పేరుతో ఉ న్న వ్యవసాయ భూమిని తనతోపాటు సో దరుడి పేరుతో వారసత్వ పట్టా చేసేందుకు జీపీవో డోంగ్రి శ్రీనివాస్‌ను సంప్రదించా డు. ఉన్నతాధికారులకు నివేదిక పంపించేందుకు శ్రీనివాస్ మొదట రూ.50వేలు డి మాండ్ చేసి, ఆ తర్వాత రూ.22వేలకు ఒ ప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం 2.10గంటలకు బాధితుడి నుంచి జీపీవో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నా రు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చే సుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మధు తె లిపారు. కరీంనగర్‌లోని ఏబీసీ కేసుల ప్ర త్యేక న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరుస్తామని తెలిపారు. అలాగే కార్యాలయంలో ఇతర రికార్డులను సైతం పరిశీలించిన ట్లు పేర్కొన్నారు. ఏసీబీ సీఐ లు కిరణ్‌కుమార్, రవీందర్, సిబ్బంది ఉ న్నారు.
పేకాడుతున్న
ఐదుగురి అరెస్ట్
బెజ్జూర్: బెజ్జూర్‌లో పక్కాసమాచారంతోనే ఎస్సై కె.రమేశ్ ఆధ్వర్యంలో గురువారం పే కాటస్థావరంపై దాడి నిర్వహించారు. పేకా డుతున్న ఐదుగురిని అరెస్టు చేసి 52 పేక ముక్కలు, రూ.2,500 నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


