4న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా | - | Sakshi
Sakshi News home page

4న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా

Oct 30 2026 12:09 AM | Updated on Oct 30 2026 12:09 AM

● ఒప్పందాలు అమలు చేయాలి ● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య

శ్రీరాంపూర్‌: యాజమాన్యంతో తాము కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చేనెల 4న కంపెనీ వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేయనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ సీతారామయ్య తెలిపారు. గురువారం నస్పూర్‌ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్‌ ఫిట్‌ అయిన 210 మంది డిపెండెంట్లకు వెంటనే నియామకపత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో జీఎం కార్యాలయాల్లో ఇచ్చే ఈ నియామకాలను నేడు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఇప్పించడం కోసం జాప్యం చేస్తున్నారని తెలిపారు. ప్రతీనెల ఏరియాస్పత్రుల్లోనే మెడికల్‌ బోర్డు నిర్వహిస్తామని చెప్పిన కూడా గత నెల చేపట్టలేదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్లు ఉండాలన్నారు. గతంలో ఉన్న పద్ధతినే అనుసరించాలన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. సొంతింటి పథకం, పెర్క్స్‌పై ఆదాయ పన్ను మాఫీ వంటి ఒప్పందాలు అమలు చేయిస్తామన్నారు. సమావేశంలో యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.వీరభద్రయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్‌బాజీసైదా, నాయకులు అఫ్రోజ్‌ఖాన్‌, సుధాకర్‌, పెద్దన్న, నారాయణ, కోడి వెంకటేశ్‌, రాజ్‌కుమార్‌, రాకేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement