తాండూర్: ముక్కు పచ్చలారని ఓ బాలుడు తన తండ్రికి తలకొరివి పెట్టిన హృదయ విదారక ఘటన తాండూరు మండలం మాదారం టౌన్న్షిప్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదారం టౌన్షిప్కు చెందిన పుట్ట రాజేంద్రప్రసాద్ (35) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదేళ్ల కుమారుడు దేవాన్న్ష్ తండ్రి అంత్యక్రియల సమయంలో కుండ పట్టుకుని పాడె ముందు నడిచాడు. చితిపై కట్టెలు పేర్చి మృతదేహానికి నిప్పంటించాడు. పసివయసులోనే తండ్రికి తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి రావడం అక్కడికి వచ్చిన వారందరినీ కన్నీటి పర్యంతం చేసింది. దేవాన్ష్, అతని సోదరుడు (మూడేళ్ల చిన్నారి) చూసిన స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


