శ్రీరాంపూర్: గత బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తోదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గురువారం ఆర్కే 7 గనిపై కార్మికులను కలిసి మాట్లాడారు. గతప్రభుత్వ మాదిరిగా నేడు రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. సింగరేణిలో ప్రతీనెల మెడికల్ బోర్డు నిర్వహిస్తామని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కూడా నెరవేరలేదన్నారు. బోర్డు జాప్యంతో చాలామంది కార్మికులు డ్యూటీలు చేయలేక డిస్మిస్కు దగ్గరవుతున్నారని తెలిపారు. సొంతింటి కల అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గు కని కార్మికుల 12వ వేతన కమిటీని ఏర్పాటు చేయించాలని కోరారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఫిట్ సెక్రెటరీ యెల్లం శ్రీధర్, సెక్రెటరీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


