వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

Oct 30 2026 12:09 AM | Updated on Oct 30 2026 12:09 AM

జన్నారం: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని మంచిర్యాల ఎస్‌ఈ రాజన్న తెలిపారు. ‘విద్యుత్‌ కోత.. కాలువ నీటి కొరత’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. డీఈ ఖైజర్‌తో కలిసి మండలంలోని కలమడుగు, ధర్మారం గ్రామాల్లో పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. కరెంటు కోతలు, వరి పంటపై తెలుసుకున్నారు. కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరాకు కృషి చేస్తున్నామని అన్నారు. రైతుల కోసం పగటి పూట విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, సమస్యలుంటే స్థానిక విద్యుత్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. మండలంలో విద్యుత్‌ మోటార్ల కింద వరి పంట ఎక్కడా ఎండిపోవడం లేదని తెలిపారు. ఏడీ తిరుపతి, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement