● 1.70లక్షల ఓటర్ల విచారణ పూర్తి ● ఇప్పటి వరకు అనర్హత ఓట్లు 476గుర్తింపు ● నో మ్యాపింగ్‌ కేటగిరీ ఓట్లు 33వేలు ● వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా | - | Sakshi
Sakshi News home page

● 1.70లక్షల ఓటర్ల విచారణ పూర్తి ● ఇప్పటి వరకు అనర్హత ఓట్లు 476గుర్తింపు ● నో మ్యాపింగ్‌ కేటగిరీ ఓట్లు 33వేలు ● వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా

Oct 30 2026 12:09 AM | Updated on Oct 30 2026 12:09 AM

● 1.70లక్షల ఓటర్ల విచారణ పూర్తి ● ఇప్పటి వరకు అనర్హత ఓట్లు 476గుర్తింపు ● నో మ్యాపింగ్‌ కేటగిరీ ఓట్లు 33వేలు ● వచ్చే నెల 9న తుది ఓటరు జాబితా

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్‌ఐఆర్‌)లో ఓటర్ల తుది ఓటరు జాబితా సిద్ధమవుతోంది. జిల్లాలో అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్ల పరిశీలన చివరి దశకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గాల పరిధిలో 747మంది బీఎల్‌వోలతోపాటు అదనంగా కేటాయించిన రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, మహిళా సంఘాలు, వాలంటీర్ల భాగస్వామ్యంతో సమగ్ర ఓటరు పరిశీలన సాగుతోంది. జిల్లాలో 1.36లక్షల అనామలీస్‌తోపాటు 33వేల అన్‌మ్యాపింగ్‌ ఓటర్ల వివరాలు సమగ్రంగా పరిశీలన చేశారు. మొత్తం 1.70లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా, ఎంపిక చేసిన తేదీల్లో విచారణ నిర్వహించారు. ఓటర్లు తమ వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలు అధికారులకు అందజేశారు. దీంతో చాలా చోట్ల ఓటర్లు తుది జాబితాలో చేరుతున్నారు. మొదట ధ్రువపత్రాల పరిశీలనలో ఓటర్లు, అధికారులకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ చివరగా ధ్రువీకరణ పత్రాల్లో వెసులుబాటు కల్పించడంతో అనేకమంది ఓటర్లకు ఊరట కలుగుతోంది.

డబుల్‌, మృతుల ఓట్లు ఔట్‌

గత జూన్‌లో సమగ్ర ఓటరు పరిశీలనలో మొదటి దశలో ఓటర్ల ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మ్యాపింగ్‌ చేశారు. ఆ సమయంలో 33వేలకుపైగా ఓటర్లు మ్యాపింగ్‌ కాలేదు. వీటనింటినీ నో మ్యాపింగ్‌ కేటగిరీలో చేర్చారు. మ్యాపింగ్‌ పూర్తయిన ఓట్లతో ముసాయిదా జాబితా విడుదల చేశాక ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. ఎన్యూమరేషన్‌ ఫాంలో వివరాల నమోదులో తప్పిదాలు జరిగినవి సరి చేశారు. ఈ నెల 5న అభ్యంతరాల వరకు పరిష్కరించారు. తుది జాబితా సిద్ధం చేస్తున్నారు. ముసాయిదా జాబితా తర్వాత ఓటర్ల పేర్లు, చిరునామా ఇతర వివరాల్లో తప్పులు, ఇతర సమస్యలు ఉన్నవి అనామలీస్‌లో సరి చేశారు. అయితే నో మ్యాపింగ్‌ ఉన్న ఓట్లు మాత్రం తొలగిపోనున్నాయి. ఈ కేటగిరీలో ఉన్న ఓట్లన్నీ రెండేసి ఓట్లు, మృతులు, శాశ్వత వలస వెళ్లిన వారివే అధికంగా ఉన్నాయి. ఈ ఓట్లను తుది జాబితాలో చేర్చరు. ఇవి కాకుండా అనామలీస్‌లో మాత్రం తుదిగా జిల్లాలో 500లోపు ఓటర్లు తుది జాబితాకు దూరమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ వీరిలోనూ తగిన రుజువులు చూపిస్తూ కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకుంటే కూడా అవకాశం ఉంటుంది. తగిన ధ్రువీకరణలు తప్పనిసరి. ఈ క్రమంలో వచ్చే నెల 9న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాలో ఎంత మంది ఓటర్లు తొలగిస్తారనేది స్పష్టత వచ్చింది.

జిల్లా కేంద్రం మంచిర్యాలలో అనామలీస్‌ ఓటర్లను పరిశీలిస్తున్న బీఎల్‌వోలు(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement