● ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్న యువత ● ఉచిత శిక్షణ కేంద్రాలకు భారీ స్పందన ● జిల్లాలో ఐదు ఉచిత శిక్షణ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

● ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్న యువత ● ఉచిత శిక్షణ కేంద్రాలకు భారీ స్పందన ● జిల్లాలో ఐదు ఉచిత శిక్షణ కేంద్రాలు

Oct 30 2026 12:09 AM | Updated on Oct 30 2026 12:09 AM

● ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్న యువత ● ఉచిత శిక్షణ కేంద్రాలకు భారీ స్పందన ● జిల్లాలో ఐదు ఉచిత శిక్షణ కేంద్రాలు

ఖాకీ కొలువే లక్ష్యం..!

మంచిర్యాలక్రైం: ఖాకీ చొక్కా వేసుకుంటే ఆ హుందాతనమే వేరు. ప్రజలకు సేవలతోపాటు సర్కారు కొలువు పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగ యువతీ, యువకులు శిక్షణ పొందుతున్నారు. జిల్లాలో రెండు నెలలుగా పోలీసు శాఖ, కలెక్టర్‌ సమన్వయంతో ఒకటి, స్థానిక ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌, సేవా భారత్‌ సంస్థ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రావు వేర్వేరుగా ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో రెండు వేల మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన వసతితోపాటు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించేందుకు అర్థమెటిక్‌, జియాగ్రఫి, పాలిటిక్స్‌, తెలంగాణ చరిత్ర, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇండియన్‌ హిస్టరీ ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ అందజేశారు. పది రోజులకోసారి మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తూ ప్రతిభను పరిశీలిస్తున్నారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలకు ఉచిత శిక్షణకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 29న ఎస్సై, డిసెంబర్‌ 20న కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షను ప్రభుత్వం నిర్వహించనుంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల్లో అర్హత సాధించేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement