మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల నగరంలోని గుడిపేటలో ఉన్న 13వ పోలీసు బెటాలి యన్ను తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం డీఐజీ మురళీకృష్ణ గురువారం తనిఖీ చేశారు. మూడు రోజుల వార్షిక తనిఖీల్లో భాగంగా వచ్చిన ఆయనకు బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. బెటాలియన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పరిసర ప్రాంతాలు, పరి పాలన విభాగాలు, పోలీసు క్వార్టర్లు, తదితర మౌలిక వసతులు పరిశీలించారు. అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బలగాల పాత్ర కీలకమని తెలిపారు. బెటా లియన్ అధికారులు, సిబ్బంది జీవన స్థితిగతులు, క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకున్నారు. విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమాండెంట్‌కు సూచించారు. అసిస్టెంట్ కమాండెంట్లు వీరరాజు, ఆంజనేయరెడ్డి, నాగభూషణం, పరిపాలనాధికారి గౌస్ మోహీయుద్దీన్ పాల్గొన్నారు.


