మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రం మంచిర్యాలలో బుధవారం అర్ధరాత్రి డీసీపీ భాస్కర్ సిబ్బందితో కలిసి రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు చేశారు. నగరంలో పోలీసులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఈ నెల 27న రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, 28న డీసీపీ భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో లేని వారికి వీడియో కాల్ చేసి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే వివరాలు ఆరా తీశారు. తిలక్‌నగర్, హమాలీవాడ రౌడీషీటర్లు, పాత నేరస్తులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుత జీవన విధానం, స్థితిగతులు, కార్యకలాపాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి జీవించిన వారి పేర్లు రౌడీషీట్ నుంచి తొలగిస్తామని తెలిపారు. బైండోవర్ ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, నగర బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు రామకృష్ణ, మధుసూదన్ పాల్గొన్నారు.


