జోడేఘాట్‌లో ఘనంగా కుమురంభీం 86వ వర్ధంతి
గిరిజన సంప్రదాయం ప్రకారం నివాళులు
హాజరైన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క
నాలుగు గంటలపాటు కొనసాగిన దర్బార్
సమస్యలు ఏకరువు పెట్టిన ఆదివాసీలు
దర్బార్ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కుమురం భీం నినదించిన జల్, జంగల్, జమీన్ ఆశయం నేటికీ నెరవేరలేదన్నారు. చాలా గ్రామాల్లో తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, పందిరి వేసేందుకు వెదురు తెచ్చుకోవడానికి కూడా అడ్డుపడుతున్నారని బాధలు వినిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనులకు వందశాతం ఇందిరమ్మ గృహాలు ఇస్తామని ఇచ్చిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ ప్రతీ గిరిజన గ్రామానికి నిరంతరం తాగునీరు అందించేందుకు సావర్‌ఖెడా సమీపంలో రూ.60 కోట్లతో ఇంటెక్‌వెల్ నిర్మిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. పిల్లలను బాగా చదివించాలని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సమస్యల ఏకరువు
కెరమెరి/ఆసిఫాబాద్‌అర్బన్: పోరుగడ్డ జోడేఘాట్ పులకించింది. ఆదివాసీ ముద్దుబిడ్డ, గోండు బెబ్బు లి కుమురంభీంకు నివాళులర్పించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఉమ్మ డి జిల్లా నుంచి ప్రజానీకం తరలివచ్చింది. అమరుడికి గిరిజన సంప్రదాయం ప్రకారం నివాళులర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం కుమురంభీం 86 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. వారికి గుస్సాడీ నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీలు, భీం వారసులతో కలిసి సంప్రదాయ పూజలు చేశారు. కుమురం భీంతోపాటు కొలాం వీరుడు కుమురం సూరుకు నివాళులర్పించారు. అంతకుముందు నాలుగు గోత్రాల జెండాలు ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
జోడేఘాట్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోండ్‌గూడ అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులు, గుస్సాడీలు చేసిన నృత్యాలు అలరించాయి. వివిధ శాఖల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐటీడీఏ పీవో మంద మకరందు ధోవ తి, రుమాలు కట్టుకుని గోండి భాషలో మాట్లాడా రు. ఆరుగురు గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా లు అందించారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్న మడావి దత్తు, కోట్నాక్ సంజీవనిలకు ల్యాప్‌టాప్‌లు అంది ంచారు. భీం మనుమడు సోనేరావు, ఇతర వారసులకు దుస్తులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్‌చౌదరి, డీఎస్పీ అశోక్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీటీడబ్ల్యూవో అంబాజీ, డీఎంహెచ్‌వో నాగేంద్ర, ఎస్‌ఈ ఉత్తమ్ జాడె, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎమ్మెల్యే సక్కు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్, జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూర్ రాజేశ్వర్, సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు, చంద్రన్న, శంకరన్న పాల్గొన్నారు.


