ఎకో పరిధి.. పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఎకో పరిధి.. పరేషాన్‌

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

● ఎకో సెన్సిటివ్‌ జోన్‌పై ఆందోళన ● నిబంధనలతో అభివృద్ధి పనులకు ఆటంకం

జన్నారం: ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిపై మండల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులకు నిబంధనలు ఆటంకంగా మారుతున్నాయనే వ్యతిరేకత ఏర్పడుతోంది. 2012లో కవ్వాల్‌ టైగర్‌జోన్‌ ఏర్పాటు కాగా 892 చదరపు కిలోమీటర్లు కోర్‌ ఏరియా, 1123 చదరపు కిలోమీటర్లు బఫర్‌ ఏరియా వ్యాపించి ఉంది. టైగర్‌జోన్‌ నిబంధనలకు తోడుగా ఎకో సెన్సిటివ్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేసి కోర్‌ ఏరియా నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు పరిధిని కేటాయించారు. కొన్నేళ్లుగా నిబంధనలు అమలులో ఉన్నా ఆరు నెలలుగా కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధిలో మండలం వెనుకబడుతోందని, ఎకోసెన్సిటివ్‌ జోన్‌తోపాటు టైగర్‌జోన్‌ ఎత్తి వేయాలని డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో సామాజిక వేత్త శ్రీరాముల భూమాచారి రెండు నెలలుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్షకు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు లభిస్తోంది. ఆయా రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వొచ్చని 2006లో సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అటవీ శాఖ ఉన్నత అధికారులు పునరాలోచించి ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధిని తగ్గించాలని కోరుతున్నారు.

నిబంధనలు అమలు

కొన్ని నెలలుగా అటవీ అధికారులు ఎకో సెన్సిటివ్‌ జోన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. జన్నారం మండల పరిసర ప్రాంతాల్లో సమీప గోదావరి తీరప్రాంతాల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో ఇసుక, మ ట్టి కొరతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం నిలిచి పోతున్నాయని సర్పంచులు పేర్కొంటున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో టైగర్‌జోన్‌ పరిధిలోని నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు నిబంధనల సడలింపుపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రస్తుతం పది కిలోమీటర్లు ఉన్న ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పరిధి కిలోమీటరుకు తగ్గించాలని పేర్కొన్నారు. నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది.

అభివృద్ధి నిలిచింది

ఎత్తివేసే వరకు దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement