వైన్‌షాపుల్లో సిట్టింగ్ రూంలు, బెల్ట్ షాపులతో బార్లు నడవక తీవ్రంగా నష్టపోతున్నాం. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)లైసన్స్ నిబంధనలు లేకపోగా తినుబండారాలు, మాంసాహార వంటకాల విక్రయాలు, కూల్‌డ్రింక్స్, తదితర అన్నీ బార్‌షాపు మాదిరి వైన్‌షాపులో సిట్టింగ్ రూం నడుపుతున్నారు. దీంతో పాటు 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉంచుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం బార్ ఫీజులు పెంచుతుండడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాం. సిట్టింగ్, బెల్ట్ షాపులను అరికట్టాలి. – జిల్లా బార్‌షాపుల నిర్వాహకులు
సమస్యలు పరిష్కరించాలి
నాకాప్ కాంట్రాక్ట్ రద్దు చేయాలి. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో నిత్యావసరాల సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించాలి. ఎఫ్‌ఆర్‌ఎస్ పేరుతో ఎస్సీ, ఎస్సీ, బీసీ వసతి గృహాల మూసివేత కుట్ర విరమించుకోవాలి. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలి.
– శ్రీకాంత్, సికిందర్, కార్తీక్,
పీడీఎస్‌యూ నాయకులు


