నిరుపేద ఆదివాసీ గిరిజనులమైన మేము ఇంటిస్థలం లేక పది మంది కుటుంబ సభ్యులతో 30 ఏళ్లుగా ఇరిగేషన్ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం. గుడిసెలు తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు ఇటీవల నోటీసులు అందించారు. మేము ఎక్కడ బతికేది. మాకు ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించి ఆదుకోవాలి.
– ముడితే ఎల్లవ్వ, కర్ణపేట, దండేపల్లి
చెరువు కబ్జాపై విచారణ చేపట్టాలి
తుమ్మల చెరువుకు తాతల కాలం నుంచి నీరటిగా పనిచేస్తున్నాం. ఈ చెరువును ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి ఆయకట్టు కింద భూములకు సాగునీరు అందిస్తోంది. ఇటీవల ఈ చెరువు కబ్జాకు గురికావడంతో నీరు తగ్గి పంటలకు సాగు నీరందడం లేదు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి.
– చెండిక తిరుపతి, ధర్మారం, భీమారం


