– వివరాలు IVలోu
నిర్మల్ జిల్లా బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా బాసర క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. రోజంతా ప్రత్యేక పూజలు, దర్శనాలతో క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆలయ పునర్నిర్మాణం, బాలాలయంలో దర్శనాల నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రాక కాస్త తగ్గిందని అధికారులు తెలిపారు.
– భైంసా/బాసర
అక్షరాభ్యాస పూజలో తల్లీకూతురు


