ఆసిఫాబాద్‌అర్బన్: గంజాయి తరలిస్తున్న నలుగురిని ఆసిఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఆసిఫాబాద్ పోలీసుస్టేషన్లో డీఎస్పీ అశోక్ వివరాలు వెల్లడించారు. అందిన ముందస్తు సమాచారం మేర కు ఈనెల 12న పోలీసులు అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నాగపురి విష్ణు, గాజుల అజయ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గుండి ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించగా మాచర్ల అశోక్, బోయిరె వినేష్ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మాచర్ల అశోక్ వద్ద 50 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు ఘటనల్లో రూ. 7,500 విలువ గల మొత్తం 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ నీలం రవీ, పోలీసులు పాల్గొన్నారు.


