చెన్నూర్: ప్రజా పోరాటాలతో నిజాం సర్కార్ కూలి తె లంగాణకు విముక్తి కలిగిందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య పే ర్కొన్నారు. చెన్నూర్‌లో ఆ దివారం నిర్వహించిన సీపీఎం సర్వసభ్య సమావేశానికి శ్యామల ఉమారాణి అధ్యక్షత వహించగా, ఆశయ్య హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, కార్యవర్గ సభ్యులు ఎర్ర పున్నం, కోటపల్లి మండల కార్యదర్శి రవి, చెన్నూర్ మండల కమిటీ సభ్యులు కరీమా, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నూర్ మండల కమిటీ కార్యదర్శిగా పుట్ట కృష్ణమాచారిని ఎన్నుకున్నారు.


