మంచిర్యాలటౌన్: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 5కే, 10కే రన్‌ను సేవాభారతి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ ప్రారంభించారు. 1,200 మందికి పైగా యువతీయువకులు, మహిళలు, వాకర్స్, రన్నర్స్, వైద్యులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడారు. ఫిట్ ఇండియాలో భాగంగా ‘ఫిట్ మంచిర్యాల’ నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి నిత్యం ఫిట్‌నెస్ సాధన చేయాలనే ఉద్దేశంతో రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షుడు ఓడ్నాల లక్ష్మీనారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం, రాజ్‌కుమార్, శ్రీశైలం, రమేశ్, చక్రవర్తి, సతీశ్‌రావు, బాపు, అశోక్‌వర్ధన్, ప్రేమ్‌సింగ్, స్వప్నారాణి, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


