ఉత్సాహంగా ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎంపిక పోటీలు

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

మంచిర్యాలఅర్బన్‌: స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ట్రినిటి హై స్కూల్‌లో నిర్వహించిన అండర్‌–17 బాలబాలికల జిల్లాస్థాయి క్రికెట్‌ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 180మంది క్రీ డాకారులు పాల్గొన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. కా ర్యక్రమంలో కార్పొరేటర్‌ స్వరూప, ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ ఎండీ యాకుబ్‌, సీనియర్‌ పీడీ గోపాల్‌, నిర్వాహక కార్యదర్శులు రవి, రవీందర్‌, సౌమిత్‌, పీఈటీలు శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌, శ్రీనివాస్‌, విజయ్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని ప్రభుత్వ మైనార్టీ బాలిక ల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 19వ తేదీ న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా తొమ్మిదో తరగతి విద్యార్థిని సాయిప్రీతి లాంగ్‌జంప్‌లో ప్రథమ, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని అసిఫాఉన్నీసా షాట్‌పుట్‌లో ప్రథ మ బహుమతులు సాధించారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్‌ షగు ఫ్తా ఫిర్దౌస్‌, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పో టీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement