ఇచ్చుకో.. కట్టుకో! | - | Sakshi
Sakshi News home page

ఇచ్చుకో.. కట్టుకో!

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

● వివాదాలకు కేరాఫ్‌గా బల్దియా ఆఫీస్‌ ● క్యాతనపల్లి మున్సిపాల్టీలో అక్రమాలు ● ఇంటి నిర్మాణ పర్మిషన్లకు చేతివాటం! ● ఓ బాధితుడి ఆరోపణలపై తీవ్ర చర్చ

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాలిటీ వి వాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. తాజాగా ఓ వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారం ఇందుకు మరింత ఆ జ్యం పోస్తోంది. ఆరోవార్డులోని 34వ సర్వే నంబర్‌లో తన రెండెకరాల వ్యవసాయ భూమిలో వాచ్‌మెన్‌ కోసం షెడ్‌ నిర్మిస్తుండగా మున్సిపల్‌ సిబ్బంది అడ్డుకున్నారని తూటి సతీశ్‌కుమార్‌ ఆరోపించారు. కమిషనర్‌ను కలిసి సమస్య వివరిస్తే.. ‘బిల్డర్స్‌ అసోసియేషన్‌ వారిని కలవండి’ అని సూచించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సిబ్బంది తనను సెల్‌ఫోన్‌ బయటపెట్టి లోపలికి రావాలని ఉచిత సలహా ఇచ్చారని ఆరోపించారు. కమిషనర్‌ సూచన మేరకు అసోసియేషన్‌ కు సంబంధించిన ఓ కౌన్సిలర్‌ను కలవగా రూ.లక్ష డిమాండ్‌ చేశారని, ఇందులో రూ.50వేలు ఫోన్‌ పే ద్వారా చెల్లించానని ఆరోపిస్తున్నా రు. ఇందుకు ఆధారాలున్నట్లు చెబుతున్నారు.

సిబ్బందిలోనూ అసంతృప్తి?

మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులు, సి బ్బందితో కమిషనర్‌ వ్యవహారంపై పలువురు సి బ్బంది అసంతృప్తి వ్యక్తంజేస్తున్నట్లు తెలిసింది. పనులు అప్పగించే విధానంలో ఇష్టారీతిన వ్యవహరించటం, సమయపాలనకు సంబంధం లే కుండా పనులు చేయించుకోవటం, భోజన విరా మ సమయాల్లోనూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు అతడిపై ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రికి తలనొప్పిగా అధికారుల తీరు?

క్యాతనపల్లి మున్సిపల్‌ అధికారుల వ్యవహారశైలిపై వరుసగా ఆరోపణలు, విమర్శలు రావటం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామికి తలనొప్పిగా మారింది. గతంలో చెన్నూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన మురళీకృష్ణపై అక్కడ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను బదిలీ చేయగా తిరిగి క్యాతనపల్లికి రావటం.. ఇక్కడా అదే తరహా ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.

పీస్‌ కమిటీ సమావేశంలోనే విమర్శలు

మరోవైపు గణేశ్‌ నవరాత్రోత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య పనుల్లో కొన్ని వార్డులకే ప్రాధాన్యం ఇస్తూ మరికొన్ని వార్డులను పట్టించుకోవటం లేదని ఇటీవల జరిగిన పీస్‌ కమిటీ సమావేశంలోనూ కమిషనర్‌ తీరుపై బహిరంగ విమర్శలు వచ్చాయి. సతీశ్‌కుమార్‌ కమిషనర్‌పై చేసిన ఆరోపణలు సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ వ్యవహారంలో మరి ఉన్నతాధికారులు, మంత్రి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

బద్నామ్‌ చేయాలనే..

నాపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. సెల్‌ఫోన్‌ బయటపెట్టి కార్యాలయంలోకి రావాలని నేను ఎన్నడూ ఎవరితోనూ చెప్పలేదు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ వాళ్ల దగ్గరకు వెళ్లాలని కూడా అనలేదు. ఏదో రకంగా నన్ను బద్నామ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

– మురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement