రైళ్ల ఆలస్యం..ప్రయాణికుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

రైళ్ల ఆలస్యం..ప్రయాణికుల అవస్థలు

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

● గంటలకొద్దీ పడిగాపులు ● ఈ రైలు రేక్‌ ప్రాథమిక నిర్వహణ హైదరాబాద్‌లోని పిట్‌లైన్‌లో నిర్వహిస్తారు. గతవారం కృష్ణాష్టమి రోజు కూడా నడిపిన ఇదే ప్రత్యేక జనసాధారణ్‌ రైలు వల్ల మరుసటి రోజు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ 4 గంటలు ఆలస్యంగా నడవడం గమనార్హం. ● ఆదివారం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుండి బీదర్‌ వరకు మధ్యాహ్నం 12:20 నిమిషాలకు బయల్దేరాల్సిన ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు (17012) సాయంత్రం 5:20 గంటలకు బయలుదేరింది. ఈ ప్రభావంతో ఎగువ మార్గంలో నడిచే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు (17011) 5 గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలు ద్వారా వినాయక చవితికి ఊర్లకు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ కారణంగా హైదరాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (12757)ను ఎక్కువగా ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ప్రత్యేక రైలును యధాతథంగా కొనసాగిస్తూ ఆ రైలుకు ప్రత్యేక రేక్‌ కేటాయించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

బెల్లంపల్లి: అధికారుల నిర్ణయంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. గంటల కొద్దీ రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07236) రై లు రేకు షేరింగ్‌ చేయడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆదివా రం ఉదయం 4:35 నిమిషాలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరాల్సిన ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు 5 గంటల 25 నిమిషాల ఆలస్యంతో ఉదయం 10 గంటలకు బయల్దేరింది. శనివారం నడిచిన ప్రత్యేక జన సాధారణ్‌ రైలు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుండి హైదరాబాద్‌ రైలుతో రేక్‌ షేరింగ్‌ చేయడం ఇందుకు కారణమనే విమర్శలున్నాయి. ఈ ప్రత్యేక జనసాధారణ్‌ రైలు హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి 11:15 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా ఆదివారం తెల్లవారుజామున 4:56 నిమిషాలకు చేరుకుంది. ఫలితంగా ఇదే రైలుతో రేక్‌ షేరింగ్‌ కలిగిన ఇంటర్‌ సిటీ రైలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement