రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

● ఇద్దరూ హత్య కేసులో నిందితులు ● రెండేళ్ల క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వ్యక్తి హత్య ● కేసు ట్రయల్‌కు రావడంతో శిక్ష తప్పదని అఘాయిత్యం

మంచిర్యాలక్రైం:

ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్‌కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్‌ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్‌ భూపాలపల్లిలో వీఆర్‌వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్‌ తోడళ్లుడు రమేశ్‌ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్‌ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్‌కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో నివాసముంటున్న మల్లేశ్‌ సోదరుడు శ్రీనివాస్‌ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement