మంచిర్యాలక్రైం: అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు మంజూరు చేయాలని టీఎన్‌జీఓస్, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ సెంట్రల్ ఫో రం అధ్యక్షుడు పొన్న మల్లయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా 22మంది అటవీశాఖ అధికారులు విధి నిర్వహణలో కలప స్మగ్లర్లు, నక్సల్స్ చేతిలో అమరులయ్యారని తెలిపారు. అటవీ ప్రాంతంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, తమ ప్రాణాలతోపాటు విలువైన అటవీ సంపదను కాపాడేందుకు ఆయుధాలు అవసరమని అన్నారు. అటవీ శాఖ అధికారులపై దాడులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్సందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి ఆయుధాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.


