పాతమంచిర్యాల: బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎస్‌బీఐఎస్‌యూహెచ్‌సీ రీజినల్ సెక్రెటరీ కే.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశ వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం ఒక్క రోజు సమ్మె చేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, సమాన పీఎల్‌ఐ వర్తింపజేయాలని, ఉద్యోగులపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన పని పరిస్థితులు, తగినంత సిబ్బంది నియామకంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఎస్‌యూహెచ్‌సీ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజినల్ సెక్రెటరీ వెంకటేష్, అసిస్టెంట్ రీజినల్ సెక్రెటరీ సతీష్, ఓబీసీ రీజినల్ సెక్రెటరీ బిల్ల సత్యనారాయణ, యూబీఐ రీజినల్ సెక్రెటరీ వసంత్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ సెక్రెటరీలు రాము, సురేష్, ఏడీసీసీ బి.బాలరాజు, వివిధ బ్యాంకుల అధికారులు ఉద్యోగులు,


