గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

గంజాయి పట్టివేత

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

చెన్నూర్‌: చెన్నూర్‌ జాతీయ రహదారిలోని అస్నాద ఎక్స్‌రోడ్డులో మోటర్‌ సైకిల్‌పై గంజాయి తరలి స్తున్న వారిని పట్టుకున్నట్లు సీఐ బన్సీలాల్‌ తెలి పారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జి ల్లా తోడ్స గ్రామం నుంచి చెన్నూర్‌ మీదుగా వేములవాడకు నంబర్‌ ప్లేట్‌ లేని మోటర్‌ సైకిల్‌పై వె ళ్తున్న ఇద్దరు యువకులను ఆపి తనిఖీ చేయగా వా రి వద్ద నుంచి కిలో 20గ్రాముల గంజాయి లభ్యమై ందన్నారు. గంజాయితో పాటు సెల్‌ఫోన్‌, రూ. 2000 నగదు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించామన్నారు. యువకులను విచారించగా గత ఏడాది నుంచి గంజాయికి బానిసలయ్యారని, రెండు రోజుల క్రితం రూ. 4 వేలు విలువ గల గంజాయిని తరలించి విక్రయించారన్నారు. శుక్రవారం మళ్లీ గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. దాని విలువ రూ.15 వేలు ఉంటుందన్నారు. యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై రాజశేఖర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నార ు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement