ఆటో డ్రైవర్‌ ఇంటికి రూ.30వేల విద్యుత్‌ బిల్లు | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ ఇంటికి రూ.30వేల విద్యుత్‌ బిల్లు

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: గృహజ్యోతి పథకం కింద గత కొంత కాలంగా జీరో విద్యుత్‌బిల్లు వస్తుండగా ఆగస్టు నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లు చూసి వినియోగదారుడు కంగుతిన్నాడు. మంచిర్యాల జిల్లా జన్నా రం మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ చిట్యాల రాజన్న ప్రతీ నెల 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగిస్తున్నాడు. దీంతో ప్రతీ నెల జీరో బిల్లు వచ్చింది. గత నెలలో రూ.30 వేల కరెంట్‌ బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. స్థానిక ఏఈని సంప్రదించగా మీటర్‌ పరిశీలించాలని తెలపడంతో శుక్రవారం మీటర్‌ తీసుకొని జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయానికి వచ్చాడు. అయితే సిబ్బంది అందుబాటులో లేరు. ఒక టీవీ, ఫ్యాన్‌, మూడు లైట్లు ఉన్న తన ఇంటికి పెద్ద మొత్తంలో కరెంట్‌ బిల్లు రావడం ఏంటని ప్రశ్నించాడు. దీని ని సరి చేయాలని వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement