చికిత్స పొందుతూ ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరు మృతి

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

ముధోల్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మహాలక్ష్మీ గల్లీకి చెందిన బాయమొల్ల సాయిలు గురువారం సాయంత్రం నాయాబాది నుంచి ముధోల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా భైంసా ఏరియాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య రాధ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement