మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం సబ్బేపల్లి శివారులోని ఓ పారాబాయిల్డ్ రైస్ మిల్‌లో శుక్రవారం బాయిలర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. ధాన్యం బాయిల్డ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా బాయిలర్ పేలుడుకు గురి కాగా సంతోష్ అనే కార్మికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాయిలర్ పేలుడు జరి గిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్యాంకు పేలడంతో రేకు ముక్కలు, ఇతర వస్తువులు 500 మీటర్ల దూ రం వరకు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రైస్ మిల్లుకు అతీ సమీపంలో ఉన్న ఇళ్లపై, ఇళ్ల ముందు కూడా బాయిలర్ రేకు ముక్కలు, ఇతర వస్తువులు పడటంతో ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కాలనీ వాసులకు జరిగిన నష్టాన్ని భరిస్తామని యా జమాన్యం హామీ ఇచ్చింది. ఘటనా స్థలాన్ని మండల నాయకులు, రైస్‌మిల్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు సందర్శించి వివరాలు ఆరా తీశారు.


