ఎక్కడి చెత్త అక్కడే.. | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి చెత్త అక్కడే..

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

● నగరంలో అపరిశుభ్రత ● పొంచి ఉన్న సీజనల్‌ వ్యాధులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. నగరంలో ప్రతీ రోజు వెలువడే చెత్త తరలించేందుకు సరిపడా కార్మికులు ఉన్నా తరలింపులో జాప్యం జరుగుతోంది. నగరంలో నిత్యం 90మెట్రిక్‌ టన్నుల చెత్త వెలువడుతోంది. జనాభాకు అనుగుణంగా 545మంది కార్మికులు ఉన్నారు. ఇందులో 400 మంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గాను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులతో మరో 70 మందిని అదనంగా తీసుకున్నారు. ఉన్నవారితో స మస్య తీరడం లేదని అదనంగా కార్మికులను తీసుకున్నా నగర పరిశుభ్రతలో మార్పు రాలేదు. అదనంగా తీసుకున్న కార్మికులు డివిజన్లలో పనులు చే స్తున్నట్లు కనిపించడం లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. కార్మికులు ఉన్నా నగరంలో చెత్త పేరుకుపోతుండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకా లం కావడంతో చెత్త పేరుకుపోయి దుర్వాసన, దో మల వృద్ధితో జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. నగరంలో సేకరించిన చెత్తను ఆండాళమ్మ కాలనీలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తుండగా పూర్తిగా నిండిపోయింది. దీంతో కొన్ని డివిజన్లలో రోజుల తరబడి చెత్త తీయకుండా అలాగే ఉంచుతున్నారనే ఆరోపణలున్నాయి. చెత్తకుప్పల నిల్వలతో వ్యాధులు ప్రబలే అకాశం ఉంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

తరలించేలా చూస్తాం

నగరంలో పారిశుద్ధ్యం మెరు గు పర్చేందుకు అదనంగా కా ర్మికులను తీసుకుని పనులు చేయిస్తున్నాం. అన్ని డివిజన్లలో చెత్త సేకరణ ప్రతీరోజు ఉండేలా చూస్తున్నాం. అదనంగా ఉన్న కార్మికులతో చెత్తను ఎప్పటికప్పుడు తరలించి, ప్రతీ డివిజ న్‌ను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటాం. – జి.అన్వేష్‌, మంచిర్యాల కార్పొరేషన్‌ కమిషనర్‌

మంచిర్యాల జెడ్పీ బాలికల పాఠశాల సమీపంలో రోడ్డు మధ్యలో కూరగాయల చెత్త

మంచిర్యాల ఎల్‌ఐసీ కాలనీలో రోడ్డు పక్కన పడేసిన చెత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement