అక్టోబర్‌లో 30కిలోమీటర్ల పరుగు పందెం | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో 30కిలోమీటర్ల పరుగు పందెం

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

మంచిర్యాలక్రైం: జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే అక్టోబర్‌ 11న జాతీయ స్థాయిలో 30 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గాంధారిఖిల్లా గుట్ట, ఏసీసీ క్వారీ, మరికొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి 30 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నట్లు తెలిపారు. 5, 10, 30 కిలోమీటర్లు ఒక ప్రయోగాత్మకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పాల్గొనే వారికి పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని తెలిపారు. ఆసక్తి గలవారు www. gtrultra. com ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, 15ఏళ్లు పైబడిన వారు అర్హులని తెలిపారు. ఇప్పటివరకు బెంగళూర్‌, పూణె, అహ్మదాబాద్‌, చెన్నయ్‌ తదితర రాష్ట్రాల నుంచి 150 రిజిస్ట్రేషన్లు వచ్చాయని తెలిపారు. పూర్తి వివరాలకు 8639337951 నంబరులో సంప్రదించాలని తెలిపారు. జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రతీ ఆరు నెలలకోసారి ఏదో ఒక కార్యక్ర మం నిర్వహిస్తామ ని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు రక్తదానం శిబిరం

అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు డీఎఫ్‌ఓ రాహుల్‌కిషన్‌ జాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement