లోకేశ్వరం: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన ఈరవాడ్ సాయినాథ్(43) గ్రామ సమీపంలోని దేవుని చెరువులో ప్రమాదవాశాత్తు పడి మరణించారు. ఏఎస్సై భారతి తెలిపిన వివరాల ప్రకా రం.. సాయినాథ్ చిరువ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంత కాలంగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం గ్రామ సమీపంలోని దేవుని చెరువులో శవమై కనిపించాడు. చేపల వేటకు వెళ్లి ముర్చావ్యాధితో ప్రమాదవాశత్తు నీటమునిగి మరణించారని ఏఎస్సై పేర్కొన్నారు. సాయినాథ్‌కు భార్య లక్ష్మి, ముగ్గురు కుమారైలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
బావిలో పడి
మతిస్థిమితం లేని వృద్ధుడు..
సిరికొండ: మండలంలోని సోన్‌పెల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ధుడు పంచకలే విశ్వనాథ్ (70) వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం మతిస్థితమితం కోల్పోయిన విశ్వనాథ్ ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ నెల 8న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన గాయక్వడ్ శివాజీ పంటచేనుకు వెళ్లి తన వ్యవసాయ బావిలో విశ్వనాథ్ మృతదేహాన్ని గుర్తించాడు. మతిస్థిమితం లేని విశ్వనాథ్ ఇంటినుంచి బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


