ఆదివాసీ సంస్కృతి గొప్పది | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ సంస్కృతి గొప్పది

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

ఉట్నూర్‌రూరల్‌: ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పదని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. గురువారం పొలాల అమావాస్య సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మరగొళ్ల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. పొలాల అమావాస్య పండుగకు నెల ముందుగానే ఆదివాసీ గ్రామాల్లో మరగొళ్లతో ఆడుతూ, పాడుతూ సందడి చేసే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ భాష, సంస్కృతి పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొన్న వెంకటేశ్‌, లాల్‌శావ్‌, కొముర విఠల్‌ను అభినందించారు. సాంస్కృతిక గిరి సిబ్బంది, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్‌, ఈఈ తానాజీ, డిప్యూటీ డీఈవో చందన్‌, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అధికారులు, సిబ్బంది, ఆదివాసీ కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement