బెల్లంపల్లి: అటవీశాఖ అధికారులు బుధవా రం అడవిపంది మాంసం పట్టుకున్నట్లు బెల్ల ంపల్లి రేంజ్ అధికారి సీహెచ్ పూర్ణచందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేర కు రేంజ్ పరిధిలోని ధర్మారావుపేట బీట్‌లో బుగ్గగూడ సమీపంలోని పత్తి చేనులో గాలింపు చర్యలు చేపట్టగా సంకుర్తల శ్రీకాంత్ ప ట్టుబడ్డాడు. అతన్ని విచారించగా అడవిపందిని వేటాడి చంపినట్లు అంగీకరించాడు. అతనితో పాటు మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన శ్రీనివాస్, రంజిత్‌పై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు.
కిరాణా దుకాణంలో చోరీ
కౌటాల(బెజ్జూర్): బెజ్జూర్ మండల కేంద్రంలోని రాచకొండ చంద్రశేఖర్ కిరాణా దుకాణంలో చోరీ జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం దుకాణం తెరిచి కౌంటర్‌లో చూడగా రూ. 60 వేల నగదు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. బెజ్జూర్ ఎస్సై సర్తాజ్‌పాషా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగ తన ముఖానికి కవర్ వేసుకోవడంతో పాటు తన వేలి ముద్రలు పడిన చోటును బట్టతో క్లిన్ చేసినట్లు రికార్డయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అడవి పందుల బీభత్సం
సిరికొండ: మండలంలోని కొండాపూర్ శివారులో మంగళవారం రాత్రి రైతు సాయిని రాయమల్లు మూడెకరాల మొక్కజొన్న చేనుపై అడవిపందులు దాడిచేసి ధ్వంసం చేశాయి. చేతికి అందివచ్చిన పంటలపై అడవి పందులు దాడులు చేస్తుండడంతో రైతులు రాత్రివేళ కాపలాగా వెళ్తున్నారు.


