బియ్యం త్వరగా అందించాలి | - | Sakshi
Sakshi News home page

బియ్యం త్వరగా అందించాలి

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

భీమారం: రైస్‌మిల్లర్లు తమకు నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బియ్యాన్ని త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని అంకూసాపూర్‌ గ్రామంలో సమత రైస్‌మిల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. రైస్‌మిల్లు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మద్దికల్‌లో వరి సాగు చేయడాన్ని గమనించిన కలెక్టర్‌ కొందరు రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. బోర్లు, చెరువులు ఉండడంతో వరిసాగు చేస్తున్నామని రైతులు కలెక్టర్‌కు వివరించారు. మద్దికల్‌లో రీసర్వేను పరిశీలించి నిర్ధేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు రాగా వారితో కలెక్టర్‌ మాట్లాడారు. నోటీసులకు సరైన పత్రాలను చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సదానందం, ఎంపీడీవో వీణ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement