మంచిర్యాలక్రైం: వినాయక విగ్రహాల మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. రామగుండం కమిషనరేట్‌లోని సమవేశం మందిరంలో మంగళవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీ స్ అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అందరూ మతాలకతీతంగా సమన్వయంతో ఉత్సవా లు నిర్వహించాలని తెలిపారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్జనానికి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండపాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, రవాణా, భక్తుల రద్దీ నియంత్రణ, శోభాయాత్ర, నిమజ్జనం వరకు ప్రతీ దశలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అ న్నారు. ప్రతీ మండపాన్ని జియో ట్యాగింగ్ ద్వారా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుంటుందని తెలిపారు. ఏదైనా సమ స్య తలెత్తితే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని తెలపారు. ఈ సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సీఐలు కృష్ణకుమార్, భీమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


