న్యూస్‌రీల్
పాతమంచిర్యాల: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న సినిమావాడలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత దినోత్స వ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ నిరక్షరాస్య త నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంద ని, అర్హత కలిగిన ఉపాధ్యాయ బృందం పని చేస్తోందని అన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షు డు పీ.వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్‌పర్సన్ డీ.వేణుగోపాల్, పాఠశాల హెచ్‌ఎం ప్రతిభావతి పాల్గొన్నారు.


