● ఈ నెలలో ఎండలు పెరిగితే కష్టాలే.. ● ఇప్పటికే పలు మండలాల్లో లోటు ● పొదుపుగా వాడితేనే జల సంరక్షణ | - | Sakshi
Sakshi News home page

● ఈ నెలలో ఎండలు పెరిగితే కష్టాలే.. ● ఇప్పటికే పలు మండలాల్లో లోటు ● పొదుపుగా వాడితేనే జల సంరక్షణ

Sep 8 2026 12:47 AM | Updated on Sep 8 2026 12:47 AM

● ఈ నెలలో ఎండలు పెరిగితే కష్టాలే.. ● ఇప్పటికే పలు మండలాల్లో లోటు ● పొదుపుగా వాడితేనే జల సంరక్షణ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురువలేదు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఈ నెల 7వరకు మొత్తం 817మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 756మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. కొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువగా వానలు పడ్డాయి. దీంతో ఆయా మండలాల్లో భూగర్భజలాలు లోతులో ఉన్నాయి. ఆగస్టు నెల వరకు జిల్లాలో భూగర్భ జలాల సగటు లభ్యత 4.57 మీటర్లు ఉండగా, గతేడాది ఇదే నెలలో జిల్లా సగటు చూస్తే 6.45మీటర్లుగా ఉంది. ఇప్పటికీ జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లోనూ నీటి లభ్యత తక్కువగానే ఉంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కీలకమైన నైరుతి రుతుపవన కాలంలోనే వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు, సాగునీటి ప్రాజెక్టులు, గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరేది. ఈసారి రెండు సార్లు మినహా భారీగా వరదలు రాలేదు. దీంతో భూమిలోకి నీరు ఇంకకపోవడంతో లభ్యత తగ్గుతోంది.

ఎండలు పెరిగితే..

వానాకాలంలోనూ ఎండల తీవ్రత పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఉక్కపోత, వేడిమి పెరుగుతోంది. దీంతో పంటలకు నీటి అవసరం ఎక్కువ అవుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి వాడకం పెరుగుతుంది. దీంతో భూగర్భజలాల వాడకంగా ఉన్న బావులు, బోర్ల నుంచి ఎక్కువ మొత్తంలో నీటిని తోడాల్సి వస్తుంది. వేసవి తరహాలోనే వానాకాలంలోనూ బోర్లు, బావులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వేగంగా భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే జైపూర్‌, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల పరిధిలో నీటి లభ్యత లోతుకు చేరుతోంది. ఈ నెలలో వర్షాలు ఆశించిన మేర పడకపోతే నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో పంటలు కాపాడుకోవడానికి నీటిని అధికంగా వినియోగించాల్సి ఉంది. మరోవైపు గృహా, వాణిజ్య, పరిశ్రమల కోసం పట్టణాలు, జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా బోర్లు వాడుతున్నారు. దీంతో వేగంగా నీటి లభ్యత తగ్గుతోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని భూగర్భ జల సంరక్షణ అధికారులు కోరుతున్నారు.

పొదుపుగా నీటిని వాడాలి

ఎల్‌నినో ప్రభావంతో ఈ నెలలో తగినంత కురియకపోతే క్రమంగా భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికై తే జిల్లాలో సాధారణ స్థితిలోనే ఉన్నాయి. భూగర్భ జలాలను అందరూ అవసరం మేరకు పొదుపుగా వాడాల్సి ఉంది.

– వి.సురేశ్‌, జిల్లా భూగర్భజల శాఖ అధికారి

జిల్లాలో ఆగస్టు నెలలో భూగర్భ జలాలు(మీటర్లలో)

మండలం గ్రామం గతేడు ఈఏడాది

బెల్లంపల్లి బెల్లంపల్లి 15.98 12.15

భీమిని రాంపూర్‌ 2.08 0.31

చెన్నూరు చెన్నూరు 8.01 7.02

చెన్నూరు కొమ్మెర 2.62 0.94

దండేపల్లి మ్యాదరిపేట 4.48 1.50

హాజీపూర్‌ హాజీపూర్‌ 5.12 1.57

జైపూర్‌ జైపూర్‌ 2.92 6.31

జైపూర్‌ కుందారం 8.58 10.55

జన్నారం ఇందన్‌పల్లి 3.44 1.46

కన్నెపల్లి జన్కాపూర్‌ 0.01 0.01

కాసిపేట కొండాపూర్‌ 3.75 1.43

కోటపల్లి కోటపల్లి 17.52 17.03

లక్షెట్టిపేట లక్షెట్టిపేట 0.98 0.52

మందమర్రి మందమర్రి 4.50 3.67

మందమర్రి పొన్నారం 16.66 8.86

నెన్నెల నెన్నెల 6.76 2.30

తాండూరు తాండూరు 15.54 11.11

వేమనపల్లి నీల్వాయి 0.59 0.41

జన్నారం జన్నారం 5.85 2.55

జన్నారం తపాలాపూర్‌ 3.09 1.76

భీమారం భీమారం 8.11 7.35

మంచిర్యాల మంచిర్యాల 6.39 1.01

నస్పూర్‌ నస్పూర్‌ 6.70 7.80

వేమనపల్లి లక్ష్మీపూర్‌ 4.25 2.36

కన్నెపల్లి నాయకిన్‌పేట 7.44 4.20

జిల్లా సగటు 6.45 4.57

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement