చెన్నూర్: జిల్లాలో మంగళవారం నుంచి ఎస్‌జీఎఫ్ పోటీలు నిర్వహించనున్నారు. గత ఏడాది జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో 13 పతకాలు సాధించారు. జిల్లాలోని 18 మండలాల్లో ప్రతియేటా పాఠశాలకు రూ.25వేలు, పీఎంశ్రీ పాఠశాలలకు రూ.50వేల క్రీడా సామగ్రి అందజేస్తున్నారు. దీంతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో పతకాల సాధనలో ముందుంటున్నారు. గత ఏడాది జిల్లాకు చెందిన 22మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఐదు బంగారు, ఐదు వెండి, మూడు కాంస్య పతకాలు సాధించగా.. తొమ్మిది మంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో చెన్నూర్‌కు చెందిన క్రీడాకారులే ఎక్కువగా ఉండడం గమనార్హం. జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు పాల్గొంటున్నా అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం లేదు. 8, 9, 10వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలు లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించినట్లు పీడీలు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాల సాధనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పీఈటీలు శిక్షణ ఇస్తున్నారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండీ.యాకుబ్ తెలిపారు.
జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యం
గత ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐదో స్థానంలో నిలిచిపోయా. ఈ ఏడాది జాతీయ స్థాయిలో పతకం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఇందుకోసం నిరంతరం సాధన చేస్తున్న. మైదానాల కొరత కారణంగా సాధనకు కష్టం అవుతుంది.
– అకాశ్, ఎంజేపీ పాఠశాల, చెన్నూర్
లాంగ్‌జంప్‌లో..
ఎస్‌జీఎఫ్‌తోపాటు పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాను. ఈసారి ఎస్‌జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తా. నీల్వాయి జిల్లా పరిషత్ పాఠశాలలో చిన్న మైదానం ఉన్నా పీడీ సార్ శిక్షణ ఇస్తున్నారు.
– మల్లేశ్వరి, హైస్కూల్, నీల్వాయి


