మంచిర్యాలక్రైం: సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ కీలక పాత్ర పోషిస్తారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం కమిషనరేట్ పరిధిలోని సైబర్ వారియర్స్‌తో సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు కోల్పోయిన వారి డబ్బులను తిరిగి ఇప్పించడమే లక్ష్యంగా సైబర్ వారియర్స్ పని చేస్తున్నారని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతీ గణేష్ మండపంలో సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ ఎస్పీ సాయిశ్రీ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణరెడ్డి, సైబర్ క్రైం సీఐలు రాణప్రతాప్, శ్రీనివాస్, మారుతి, క్రాంతి, ఎస్సైలు పాల్గొన్నారు.
తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్..
సమస్యల తక్షణ పరిష్కారం కోసమే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్‌లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారితో మాట్లాడి చట్టపరిదిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


