‘సర్‌’ పకడ్బందీగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పకడ్బందీగా పూర్తి చేయాలి

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● ఓటరు జాబితా జిల్లా పరిశీలకురాలు యోగితారాణా

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు యోగితారాణా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చంద్రకళ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయత్‌ అలీతో కలిసి ఏఈఆర్‌వోలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1.70 లక్షల మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు రూపొందించామని, 1.10లక్షల మందికి పంపిణీ చేశామని, మిగతా 60 వేల నోటీసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన 11 ధ్రువీకరణ పత్రాల్లో నుంచి మాత్రమే సమర్పించాలని సూచించారు.

పోలింగ్‌ కేంద్రాల సందర్శన

నస్పూర్‌: నస్పూర్‌లోని రేడియంట్‌ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను యోగితా రాణా సోమవారం సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement